మంత్రి హెలికాప్టర్.. అత్యవసర ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ కేబినెట్‌లో సీనియర్ మంత్రి అయిన ఆజంఖాన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకొన్నారు.
ఉత్తరప్రదేశ్ కేబినెట్‌లో సీనియర్ మంత్రి అయిన ఆజంఖాన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జహంగీరాబాద్ సమీపంలోని కరండ్ గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య కారణంగా దీన్ని అక్కడ దించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
లక్నో నుంచి బహ్రైచ్ వెళ్లాల్సిన ఈ హెలికాప్టర్‌లో ఏ రకమైన సాంకేతిక సమస్య వచ్చిందో మాత్రం తెలియలేదు. అయితే ఖాన్ వెళ్తున్న దీన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి రావడంతో ఏమవుతుందోనని అంతా ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు గ్రామంలోనే అయినా సురక్షితంగా కిందకు దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్‌లో ఉన్నవాళ్లంతా సురక్షితంగానే ఉన్నారని, అది కిందకు దిగిన తర్వాత ఆజం ఖాన్‌ను రోడ్డు మార్గంలో లక్నో పంపామని పోలీసు సూపరింటెండెంట్ రాజాబాబు తెలిపారు.