మంత్రిపేరుతో ఫేస్బుక్ కామెంట్.. కుర్రోడు జైలుపాలు | facebook comment in the name of azam khan lodges youth in jail | Sakshi
Sakshi News home page

మంత్రిపేరుతో ఫేస్బుక్ కామెంట్.. కుర్రోడు జైలుపాలు

Published Wed, Mar 18 2015 4:13 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

మంత్రిపేరుతో ఫేస్బుక్ కామెంట్.. కుర్రోడు జైలుపాలు - Sakshi

మంత్రిపేరుతో ఫేస్బుక్ కామెంట్.. కుర్రోడు జైలుపాలు

ఉత్తరప్రదేశ్లో అత్యంత శక్తిమంతమైన మంత్రి ఆజంఖాన్ పేరుతో ఫేస్బుక్లో కామెంట్ పోస్టు చేసినందుకు ఓ టీనేజి విద్యార్థి జైలు పాలయ్యాడు. బరేలిలోని ఓ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిపై పోలీసులు సెక్షన్ 66 ఎ కింద కేసు పెట్టారు. శాంతిభద్రతలకు భంగం కలిగించారన్నది అతడిపై చేసిన ఆరోపణ. ఈ కుర్రాడి ఫేస్బుక్ పోస్టింగ్పై ఆజంఖాన్ అనుచరుడు ఫసాహన్ అలీఖాన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

దాంతో పోలీసులు వెంటనే అతడిని అరెస్టుచేసి, కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లాజైలుకు పంపారు. ఆజంఖాన్ పేరుతో అసత్య ప్రచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, అవి హిందూ ముస్లింలిద్దరి మనోభావాలను దెబ్బతీశాయని, ఆజం ఖాన్ పరువుకు కూడా భంగం వాటిల్లిందని అలీఖాన్ చెప్పారు. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు కుర్రాడి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement