chopper emergency landing
-
మంత్రి హెలికాప్టర్.. అత్యవసర ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆజంఖాన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జహంగీరాబాద్ సమీపంలోని కరండ్ గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య కారణంగా దీన్ని అక్కడ దించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. లక్నో నుంచి బహ్రైచ్ వెళ్లాల్సిన ఈ హెలికాప్టర్లో ఏ రకమైన సాంకేతిక సమస్య వచ్చిందో మాత్రం తెలియలేదు. అయితే ఖాన్ వెళ్తున్న దీన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి రావడంతో ఏమవుతుందోనని అంతా ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు గ్రామంలోనే అయినా సురక్షితంగా కిందకు దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్లో ఉన్నవాళ్లంతా సురక్షితంగానే ఉన్నారని, అది కిందకు దిగిన తర్వాత ఆజం ఖాన్‌ను రోడ్డు మార్గంలో లక్నో పంపామని పోలీసు సూపరింటెండెంట్ రాజాబాబు తెలిపారు. -
ప్రణబ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం
వడోదర: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయ సిబ్బందికి ప్రమాదం తప్పింది. ఆదివారం ప్రణబ్ కార్యాలయ సిబ్బందిని తీసుకెళ్తున్న హెలికాప్టర్‌కు సాంకేతికలోపం ఏర్పడటంతో గుజరాత్‌లోని వడోదరలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ హెలికాప్టర్లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ సింఘ్ వాఘేలా కూడా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ గుజరాత్ పర్యటనకు వెళ్లడంతో కార్యాలయ సిబ్బంది ఆయన వెంట వెళ్లారు. -
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ముప్పు
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మరో బీజేపీ ఎంపీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజన్లో సమస్య తలెత్తడంతో దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే తిరిగిన చాపర్‌ను, పైలట్ కష్టమ్మీద కిందకు దించాడు. తామంతా సురక్షితంగానే ఉన్నామని ఆ తర్వాత రిజిజు తెలిపారు. మాలా రాజ్యలక్ష్మి షా అనే ఎంపీ కూడా రిజిజుతో పాటు ఉన్నారు. వారిద్దరినీ ఆ తర్వాత ఎంఐ-17వి5 హెలికాప్టర్లో తరలించారు. ఇంజన్ విఫలం అయ్యే సమయానికి హెలికాప్టర్లో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్లలో హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఇద్దరు టీవీ జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇంజన్లో సమస్య వచ్చినట్లు గుర్తించిన పైలట్, సుమారు 20 నిమిషాల తర్వాత దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
కేంద్ర హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. అసోంలో బోడో తీవ్రవాదులు, ఆదివాసీలకు మధ్య జరుగుతున్న ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తిన ప్రాంతాల పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాప్టర్.. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అసోంలోని తేజ్‌పూర్ ప్రాంతంలో రాజ్‌నాథ్ బృందం ప్రయాణిస్తున్న చాపర్‌ను అత్యవసరంగా దించారు. చాపర్‌లో తలెత్తిన లోపాన్ని పైలట్ వెంటనే గుర్తించి దాన్ని దించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.