వడోదర: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయ సిబ్బందికి ప్రమాదం తప్పింది. ఆదివారం ప్రణబ్ కార్యాలయ సిబ్బందిని తీసుకెళ్తున్న హెలికాప్టర్కు సాంకేతికలోపం ఏర్పడటంతో గుజరాత్లోని వడోదరలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.
ఈ హెలికాప్టర్లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ సింఘ్ వాఘేలా కూడా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ప‍్రణబ్ గుజరాత్ పర్యటనకు వెళ్లడంతో కార్యాలయ సిబ్బంది ఆయన వెంట వెళ్లారు.
ప్రణబ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం
Published Sun, Oct 23 2016 6:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement
Advertisement