దొంగతనాలు జరగకుండా.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ వంటివి కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్‌కుకు పలు రకాల వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోలింగ్ కోసం పోలీసులు గేదెలను ఉపయోగిస్తారట. ఇదేంటి గేదెలతోనా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వాటితో గస్తీ కాయడం అంత ఈజీ కాదు. ఎక్కడ..? ఏ దేశంలో ఇలా చేస్తారంటే..?
బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై గస్తి నిర్వహిస్తారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు ఎక్కువగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని అక్కడి స్థానికులు చెబుతుంటారు.
ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఉష్ణ మండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తూ.. గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు కూడా. అంతేగాదు ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు.
అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్చించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది అంత ఈజీ మాత్రం కాదు.
ఇది అత్యంత సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం అనేది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మాత్రం వింతగా కనిపిస్తుంది. ఇది ఒకరకంగా ప్రకృతి, దేశ సంస్కృతి ఒక దానిపై ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేందుకు తమ దేశ పోలీసులు ఇలా గేదెలపై గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ గేదె బలం, సహకారం, ప్రత్యేక జీవన విధానానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్లే దీన్ని తాము ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు.
(చదవండి: హీరోయిన్‌లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..)
Comments
Please login to add a commentAdd a comment