ఎమ్మెల్యే గేదెలు ఎత్తుకెళ్లి లక్షకు అమ్మి.. | Man arrested for stealing buffaloes of BJP MLA in UP | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గేదెలు ఎత్తుకెళ్లి లక్షకు అమ్మి..

Published Thu, Sep 24 2015 4:05 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

ఎమ్మెల్యే గేదెలు ఎత్తుకెళ్లి లక్షకు అమ్మి.. - Sakshi

ఎమ్మెల్యే గేదెలు ఎత్తుకెళ్లి లక్షకు అమ్మి..

రాయ్ బరేలీ: ఏకంగా ఓ దొంగ ఎమ్మెల్యే గేదెలను ఎత్తుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేసుకున్నాడు. ఆ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని మూడు నెలల తర్వాత అరెస్టు చేశారు. ఆ దొంగ మూడు నెలలకిందట మొత్తం తొమ్మిది గేదెలను దొంగిలించాడని అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పుడు చిక్కాడని పోలీసులు తెలిపారు. గత జూన్ 22 అర్ధరాత్రి సమయంలో ధర్మపాల్ సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన గేదెలను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు.

దీంతో ఆ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ప్రాంతానికి చెందిన మొత్తం అధికార యంత్రాంగం కదిలింది. ఎట్టకేలకు మూడు నెలలపాటు దొంగ కోసం గాలింపులు చేపట్టి సిరౌలి అనే ప్రాంతంలో అక్రం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రాంపూర్ జిల్లాలో మొత్తం గేదెలను మాంసం విక్రయదారులకు రూ.లక్షకు అమ్మేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement