లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన రైల్వే సీఐ | railway protection force police officer arrests on cbi | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన రైల్వే సీఐ

Published Mon, Feb 16 2015 11:52 PM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM

railway protection force police officer arrests on cbi

 ఏలూరు (వన్ టౌన్) : ఏలూరులోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సీఐ కె.జోజి తినుబండారాల విక్రేత నుంచి రూ.6 వేల లంచం తీసుకుంటూ సీబీఐ వలలో చిక్కారు. విశాఖపట్నంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం-ఏలూరు మధ్య రైళ్లలో తిరుగుతూ తినుబండారాలు అమ్ముకునే వారికి ఓ వ్యక్తి వాటిని సరఫరా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అతనికి తగిన అనుమతులు లేకపోవడంతో ఏలూరులో రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ సీఐగా పనిచేస్తున్న కె.జోజి నెలకు రూ.6 వేల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గత నెలలకు సంబంధించి కూడా అదే మొత్తంలో ఇవ్వాలని కోరాడు.
 
 అంత ఇచ్చుకోలేనని సదరు వ్యాపారి చెప్పడంతో గత నెలలు, ప్రస్తుత నెలకు సంబంధించి రూ.6 వేలు ఇవ్వాలని అడిగాడు. దీంతో బాధితుడు సీబీఐ అవినీతి విభాగం అధికారులను ఆశ్రరుుంచాడు. ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి ఫిర్యాదు దారునుంచి రూ.6 వేల లంచం తీసుకుంటున్న సీఐ కె.జోజిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని సీఐ కార్యాలయూన్ని, అనంతరం అతని ఇంటిని తనిఖీ చేసి వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జోజిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని, ఈనెల 27 వరకు అతడికి రిమాండ్ విధించారని సీబీఐలోని ఏసీబీ విభాగం ఎస్పీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారెవరైనా లంచం అడిగితే 1800 425 00100 నంబర్‌కు ఫోన్ చేయూలని, లేదంటే ఈమెరుుల్ ఐడీ జిౌఛ్చఛిఠిటజుఞఃఛిఛజీ.జౌఠి.జీ కి ఫిర్యాదు చేయూలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement