![RPF Officer saved Man life in Panvel Railway Station - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/6/panvel-station.jpg.webp?itok=BZ5S9GWX)
ముంబై: కదులుతున్న రైలును ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఓ దివ్యాంగుడిని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాపాడారు. మహారాష్ట్రలోని పనవేలు రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఘటన జరిగింది. దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ట్రైన్ లోపల ఉన్న వ్యక్తి అతడిని లోపలకు లాగేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు దివ్యాంగుడు కావడంతో రైలు ఎక్కలేక పట్టుతప్పాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎష్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దివ్యాంగుడిని పక్కకు లాగి పడేశారు. దీంతో అతను ప్రాణాలు దక్కాయి. కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ దివ్యాంగుడిపై అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment