Save A Mans Life
-
లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలు వినియోగదారులకు ఎంటర్టైన్మెంట్ చేయడమే కాక ఎన్నో విధాలుగా లాభం చేకూరుస్తోంది. అయితే సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ఒకరి ప్రాణం నిలిపిన సంఘటన మనదేశంలోనే జరిగింది. ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని గ్రహించిన ఫేసుబుక్ సంస్థ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడకుండా వెంటనే చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: సాయితేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు.. మోహన్‌బాబు ఢిల్లీలోని సీలంపూర్‌కు చెందిన ఓ యువకుడు (27) శనివారం తన ఫేస్బుక్లో ఓ పోస్టు చేశాడు. ‘నేను ప్రేమలో ఫెయిలయ్యా. ప్రేమ విఫలంతో చదువుపై శ్రద్ధ ఉండడం లేదు. దీంతో ఎంబీఏను మధ్యలోనే ఆపివేశా. ఇక నాకు చావే దిక్కు.’ అని పోస్టు చేశాడు. అయితే ఇలాంటి సంఘటనల నివారణకు ఫేస్బుక్లో కొన్ని చర్యలు తీసుకున్నారు. అతడి మెసేజ్‌లో ఆత్మహత్య అనే పదాలు కనిపించడంతో వెంటనే ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ ప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయాన్ని భారత రాయబారి కార్యాలయానికి సమాచారం అందించింది. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి ఆ సమాచారం కాస్త ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు గంటల్లో ఆ యువకుడు ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద కనిపించాడు. ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఎక్కడో ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ ఢిల్లీలో జరిగే సంఘటనను ముందే ఊహించి ఆపివేయడం ఆశ్చర్యంగా ఉంది. ఫేస్బుక్ సేవలపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది ఎలా జరిగిందో తెలుసా? హింసకు పాల్పడే, నేరాలకు ఉసిగొల్పే పోస్టులపై ఫేస్బుక్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా కొన్ని ‘కీ వర్డ్స్’ను అలర్టయ్యేందుకు రూపొందించింది. వాటిలో సూసైడ్ అనే పదం కూడా ఉంది. ఆ యువకుడు సూసైడ్ అని పోస్టు చేయడంతో వెంటనే ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ కార్యాలయం అప్రమత్తమైంది. ఐర్లాండ్‌లోని భారత హై కమిషన్‌కు, ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు స్పందించి అతడిని కాపాడారు. -
శభాష్ పోలీస్: క్షణం ఆలస్యమైతే ఘోరం జరిగేది!
ముంబై: కదులుతున్న రైలును ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఓ దివ్యాంగుడిని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాపాడారు. మహారాష్ట్రలోని పనవేలు రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఘటన జరిగింది. దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ట్రైన్ లోపల ఉన్న వ్యక్తి అతడిని లోపలకు లాగేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు దివ్యాంగుడు కావడంతో రైలు ఎక్కలేక పట్టుతప్పాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎష్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దివ్యాంగుడిని పక్కకు లాగి పడేశారు. దీంతో అతను ప్రాణాలు దక్కాయి. కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ దివ్యాంగుడిపై అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి...
నాసిక్: 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి వ్యక్తి ప్రాణాలను కాపాడాడు ఓ ట్రైనీ కానిస్టేబుల్. తన ప్రాణాలకు తెగించి మరొకరిని రక్షించాడు. వివరాల్లోకి వెళితే.. కుంభమేళా పుష్కరాల్లో భాగంగా గోదావరి జన్మస్థానమైన నాసిక్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు హాజరై పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వార్దా జిల్లాకు చెందిన 24 ఏళ్ల ట్రైనీ కానిస్టేబుల్ మనోజ్ నాసిక్‌లో పుష్కర పనుల్లో తాత్కాలిక విధులు నిర్వర్తించడానికి వచ్చాడు. అమర్‌ధామ్ బ్రిడ్జ్ పై పెట్రోలింగ్ చేయడానికి సోమవారం సాయంత్రం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో బ్రిడ్జ్ పైనుంచి వ్యక్తి దూకడం చూశాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ మనోజ్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అతని వెనకే 20 అడుగు ఎత్తున్న బ్రిడ్జి పైనుంచి దూకాడు. నీటిలో మునిగుతున్న సదరు వ్యక్తిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకి చిక్కింది. దీన్ని చూసిన కలెక్టర్, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ గెడెం, ట్రైనీ కానిస్టేబుల్ దైర్యసాహసానికి ముగ్దుడై పొగడ్తలతో ముంచెత్తాడు. మనోజ్ బ్రిడ్జ్ పైనుంచి దూకుతున్న ఫోటోతో, వ్యక్తి ప్రాణాన్ని కాపాడినందుకు సెల్యుట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. Policeman Manoj Barahate jumped off from 20 ft high bridge to save a man. One more life saved! Salute to his #bravery pic.twitter.com/jPDmFy8Aoy — Praveen Gedam (@praveengedam) September 14, 2015