లవ్‌ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్‌బుక్‌ | Facebook Alert Young Man Live Saved Within Two Hours In Delhi | Sakshi
Sakshi News home page

Facebook: ఒకరి ప్రాణం కాపాడిన సామాజిక మాధ్యమం

Published Mon, Sep 13 2021 7:35 PM | Last Updated on Mon, Sep 13 2021 8:21 PM

Facebook Alert Young Man Live Saved Within Two Hours In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలు వినియోగదారులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడమే కాక ఎన్నో విధాలుగా లాభం చేకూరుస్తోంది. అయితే సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ ఒకరి ప్రాణం నిలిపిన సంఘటన మనదేశంలోనే జరిగింది. ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని గ్రహించిన ఫేసుబుక్‌ సంస్థ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడకుండా వెంటనే చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి: సాయితేజ్‌ మూడు రోజుల్లో బయటకు వస్తారు.. మోహన్‌బాబు

ఢిల్లీలోని సీలంపూర్‌కు చెందిన ఓ యువకుడు (27) శనివారం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు. ‘నేను ప్రేమలో ఫెయిలయ్యా. ప్రేమ విఫలంతో చదువుపై శ్రద్ధ ఉండడం లేదు. దీంతో ఎంబీఏను మధ్యలోనే ఆపివేశా. ఇక నాకు చావే దిక్కు.’ అని పోస్టు చేశాడు. అయితే ఇలాంటి సంఘటనల నివారణకు ఫేస్‌బుక్‌లో కొన్ని చర్యలు తీసుకున్నారు. అతడి మెసేజ్‌లో ఆత్మహత్య అనే పదాలు కనిపించడంతో వెంటనే ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్‌ ప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయాన్ని భారత రాయబారి కార్యాలయానికి సమాచారం అందించింది.
చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్‌ హుష్‌కాకి

ఆ సమాచారం కాస్త ఢిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేరింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు గంటల్లో ఆ యువకుడు ఢిల్లీలోని సిగ్నేచర్‌ బ్రిడ్జి వద్ద కనిపించాడు. ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయితే ఎక్కడో ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్‌ ఢిల్లీలో జరిగే సంఘటనను ముందే ఊహించి ఆపివేయడం ఆశ్చర్యంగా ఉంది. ఫేస్‌బుక్‌ సేవలపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇది ఎలా జరిగిందో తెలుసా?
హింసకు పాల్పడే, నేరాలకు ఉసిగొల్పే పోస్టులపై ఫేస్‌బుక్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా కొన్ని ‘కీ వర్డ్స్‌’ను అలర్టయ్యేందుకు రూపొందించింది. వాటిలో సూసైడ్‌ అనే పదం కూడా ఉంది. ఆ యువకుడు సూసైడ్‌ అని పోస్టు చేయడంతో వెంటనే ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్‌ కార్యాలయం అప్రమత్తమైంది. ఐర్లాండ్‌లోని భారత హై కమిషన్‌కు, ఢిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు స్పందించి అతడిని కాపాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement