20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి...
నాసిక్: 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి వ్యక్తి ప్రాణాలను కాపాడాడు ఓ ట్రైనీ కానిస్టేబుల్. తన ప్రాణాలకు తెగించి మరొకరిని రక్షించాడు. వివరాల్లోకి వెళితే.. కుంభమేళా పుష్కరాల్లో భాగంగా గోదావరి జన్మస్థానమైన నాసిక్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు హాజరై పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వార్దా జిల్లాకు చెందిన 24 ఏళ్ల ట్రైనీ కానిస్టేబుల్ మనోజ్ నాసిక్లో పుష్కర పనుల్లో తాత్కాలిక విధులు నిర్వర్తించడానికి వచ్చాడు. అమర్ధామ్ బ్రిడ్జ్ పై పెట్రోలింగ్ చేయడానికి సోమవారం సాయంత్రం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో బ్రిడ్జ్ పైనుంచి వ్యక్తి దూకడం చూశాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ మనోజ్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అతని వెనకే 20 అడుగు ఎత్తున్న బ్రిడ్జి పైనుంచి దూకాడు. నీటిలో మునిగుతున్న సదరు వ్యక్తిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు.
ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకి చిక్కింది. దీన్ని చూసిన కలెక్టర్, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ గెడెం, ట్రైనీ కానిస్టేబుల్ దైర్యసాహసానికి ముగ్దుడై పొగడ్తలతో ముంచెత్తాడు. మనోజ్ బ్రిడ్జ్ పైనుంచి దూకుతున్న ఫోటోతో, వ్యక్తి ప్రాణాన్ని కాపాడినందుకు సెల్యుట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
Policeman Manoj Barahate jumped off from 20 ft high bridge to save a man. One more life saved! Salute to his #bravery pic.twitter.com/jPDmFy8Aoy
— Praveen Gedam (@praveengedam) September 14, 2015