
ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్
విజయవాడ: ఉన్నతాధికారిపై ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడటంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు సంఘీభావం తెలిపాయి.
ఐపీఎస్ అధికారిపై దాడి ఘటనలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్‌రావు, బుద్దా వెంకన్నలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఐపీఎస్ అధికారిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. దాడికి పాల్పడిన నేతలు ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్ చేపడుతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.