
టీడీపీ నేతలు పొలం కబ్జా చేశారని....
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తురు మండలం తడుకులో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ఎన్హెచ్లోని తన 5 ఎకరాల పొలాన్ని టీడీపీ నేతలు కబ్జా చేశారని మనస్తాపం చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి.
ఆ మంటలను తాళలేక అతడు పరిగెత్తాడు. దాంతో స్థానికులు అతడిని కాపాడి... తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.