‘ప్రేమ’ రెండక్షరాల మధుర భావన.. మాటలకందని తియ్యని అనుభూతి.. మనసును ఓలలాడించే ఓ అద్భుత కావ్యం.. రెండు మనసుల కలయిక.. రెండు హృదయాల గుండె చప్పుడు.. ప్రేమ ఒక సాగరం.. ఇలా వర్ణించుకుంటూ పోతే రోజులు చాలవు. అందుకే ఈ రెండక్షరాల మాట నుంచే ఎందరో సినీ కవులు మధురమైన గేయాలను రచించగలిగారు. మరెందరో దర్శకులు విభిన్నమైన చిత్రాలు తీయగలిగారు. ప్రేమ గురించి.. ప్రేమికుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. నేడు ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా అలా {పేమ లోకంలో విహరించి వివాహ బంధంతో ఒక్కటైన కొన్ని జంటల
ఉద్యమం కలిపింది...
ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన జగదీశ్.. విశాఖపట్నం ఆనందపురం మండలానికి చెందిన రాజకుమారిలను ఉద్యమం కలిపింది. జగదీశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు. రాజకుమారి విశాఖపట్నం ఎస్‌ఎఫ్‌ఐ ప్రెసిడెంట్. రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. రాజకుమారి విద్యార్థుల సమస్యలపై స్పందించే తీరు.. పోరాట పటిమ జగదీశ్‌ను కట్టిపడేశాయి.
సంఘాన్ని నడిపించడంలో శక్తిసామర్థ్యాలు.. తోటివారికి అండగా నిలవాలనే సేవాగుణం రాజకుమారికి నచ్చాయి. ఇద్దరినీ ప్రేమ తీరాలవైపు నడిపించాయి. రెండేళ్లు ప్రేమించుకుని అనంతరం ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాజకుమారి ఓ న్యూస్‌చానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తుండగా.. జగదీశ్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. ‘అంతరాలు లేని సమాజం కోసం పనిచేస్తూ.. ప్రేమ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నదే తమ లక్ష్యం’ అంటోంది ఆ జంట. తమలాంటి ప్రేమికులకు ‘వాలెంటైన్‌స డే’ ఒక పండుగలాంటిది అంటున్నారు.
అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ...
తాండూరు పట్టణానికి చెందిన ఎం.విజయ్‌కుమార్ ఓ ఉద్యమ పార్టీలో పని చేస్తున్నప్పుడు హైదరాబాద్‌కు చెందిన అనితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో 2012లో ఇద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోని కష్ట,సుఖాల్లో కలకాలం కలిసుండేదే నిజమైన ప్రేమ అని చెబుతున్నారు.
అన్యోన్యంగా ఉన్నాం..
ఇంటర్ నుంచి ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 17 ఏళ్లు అవుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒకరు ఉద్యోగం చేస్తే ఇంకొకరు న్నత చదువులకు ప్రిపేర్ కావాలన్నది ఇద్దరి అంగీకారం. అందులో భాగంగానే ఈఓపీఅర్‌డీగా ఏంపికై ఉద్యోగం చేస్తున్నాను. ప్రేమించుకోవడం ముఖ్యం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉండడం ప్రధానం. -అమృత, ఈఓపీఅర్‌డీ, మోమిన్‌పేట
మనసులు కలిశాయి.. మనువు ఒక్కటి చేసింది
నల్లగొండ జిల్లా చింతల పల్లి మండలం, నర్సాల పల్లి గ్రామానికి చెందిన జింకల యాదగిరి పేదరికం కారణంగా వసతి గృహంలో ఉండి చదువుకునేవాడు. ఈ క్రమంలో తీవ్రం జ్వరంతో కాలుకు పోలియో సోకింది. చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో తనకు తెలిసిన వారి సాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టెలిఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనికి కుదిరాడు. యజమానికి నచ్చేలా నడుచుకున్నాడు.
అదే సమయంలో యజమాని నిర్వహించే మరోషాపులో పనిచేస్తున్న అనాథ అమ్మాయి శ్రీలక్ష్మితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ముందుగా విషయాన్ని తమ యజమానికి తెలిపారు. ఆయన అంగీకరించడంతో యాదగిరి కుటుంబ సభ్యులను అడిగారు. ముందు నిరాకరించినా తర్వాత అంగీకరించారు. ఇద్దరూ పెళ్లి చేసుకొని ఘట్‌కేసర్ బస్టాపులో టెలిఫోన్ బూత్, టీస్టాల్, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ అభివృద్ధి సాధించారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ తమ మధ్య ఏనాడు మనస్పర్థలు రాలేదని చెబుతున్నారు.
నేడు ప్రేమికుల దినోత్సవం
Published Thu, Feb 13 2014 11:56 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement