rajakumari
-
బాపూజీ బాటలో...
మనసు పవిత్రం అయితే మాట కూడా పవిత్రమవుతుంది. దానికి మంత్రబలం లాంటిది వస్తుంది. బాపూజీ మాట ఎందరినో తమను తాము తెలుసుకునేలా చేసింది. తమ జీవితాన్ని కాంతి మంతమైన కొత్త బాటలోకి నడిపించుకు వెళ్లేలా చేసింది. దీనికి బలమైన ఉదాహరణ ఈ ముగ్గురు మహిళలు... మెడెలిన్ స్లెడ్ మీరాబెన్‌గా ఎలా మారింది? ‘మెడె లిన్ స్లెడ్ ఎవరు?’ అంటే టక్కున గుర్తుకురాకపోవచ్చు. అయితే ‘మీరాబెన్’ అంటే మాత్రం గాం«ధీజీ గుర్తుకు వస్తారు. బ్రిటిష్ సైనిక అధికారి సర్ ఎడ్మండ్ కుమార్తె అయిన మెడె లిన్‌కు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్ గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనను ఎంత ప్రభావితం చేసిందంటే ‘సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను’ అని గాంధీజీకి లేఖ రాసింది. ‘తప్పకుండా రావచ్చు’ అని ఆహ్వానిస్తూనే ఆశ్రమ క్రమశిక్షణ వాతావరణాన్ని గుర్తు చేశారు గాంధీ. 1925లో అహ్మదాబాద్‌కు వచ్చింది మెడెలిన్. గాంధీజీలో ఒక దివ్యకాంతిని దర్శించింది. ఆ కాంతి తనను పూర్తిగా మార్చేసింది. మద్యపానం, మాంసాహారం మానేసేలా చేసింది. ‘భగవద్గీత’ అధ్యయనం ఆమె జీవితాన్ని వెలుగుమయం చేసింది. తన పేరు ‘మీరాబెన్’గా మారింది. ఉద్యమాల్లో భాగంగా గాంధీజీతో పాటు జైలుకు కూడా వెళ్లింది. ‘సేవాగ్రామ్’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. రిషికేష్‌కు సమీపంలో ‘పశులోక్ ఆశ్రమం’ ఏర్పాటు చేసింది. బాపు తనకు రాసిన ఉత్తరాలను పుస్తకంగా ప్రచురించింది. కోట దాటి పేదల పేటకు వచ్చిన రాజకుమారి అమృత్‌కౌర్ పెరిగిన వాతావరణానికి, ఆ తరువాత ఉద్యమకారిణి గా ఆమె జీవితానికి ఎక్కడా పొంతన కనిపించదు. కోటలో రాజకుమారి పేట పేటకు తిరిగి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి స్ఫూర్తి గాంధీజీ. కపూర్థలా రాజు హరినామ్సింగ్ కుమార్తె అయిన అమృత్‌కౌర్ ఇంగ్లండ్‌లో చదువుకుంది. గాంధీజీకి ఆమె ఎన్నో ఉత్తరాలు రాసేది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమె దిశను మార్చేసాయి. 1934లో గాంధీని కలుసుకుంది. ఆ తరువాత ఆశ్రమంలో చేరింది. తన ఖరీదైన రాచరిక జీవనశైలికి, ఆశ్రమ వాతావరణానికి బొత్తిగా సంబంధం లేదు. చాలా కష్టం కూడా అనిపించవచ్చు. కాని ఎండకన్నెరుగని రాజకుమారి సామాన్యురాలిగా మారి ఆ ఆశ్రమంలో సేవ చేసింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేసింది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. గాంధీజీ తనకు రాసిన ఉత్తరాలు ‘లెటర్స్ టు రాజకుమారి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. వైద్యం నుంచి ఉద్యమం వరకు... కుంజా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) అనే చిన్న నగరం లో జన్మించింది సుశీల నయ్యర్. ఆమెకు ప్యారేలాల్ అనే అన్న ఉండేవాడు. అన్నాచెల్లెళ్లకు గాంధీజీ తత్వం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ దాని గురించి చర్చించుకునేవారు. దిల్లీలో వైద్యవిద్యను అభ్యసించింది సుశీల. 1939లో తన సోదరుడిని ‘సేవాగ్రామ్’లో చేర్పించడానికి వచ్చింది. అలా గాంధీజీతో పరిచయం పెరిగింది. పేదలకు ఆమె చేసే వైద్యసహాయం గాంధీజీ ప్రశంసలు అందుకునేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. ఇదంతా వారి తల్లిదండ్రులకు మొదట్లో నచ్చలేదు. అయితే ఆ తరువాత కాలంలో వారి ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మహత్మాగాంధీ: ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్, మహాత్మాగాంధీ: సాల్ట్ సత్యాగ్రహ... మొదలైన పుస్తకాలు రాసింది డా.సుశీల నయ్యర్. -
దిశ డీఐజీగా రాజకుమారి
సాక్షి, అమరావతి: దిశ డీఐజీగా విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్థానంలో దిశా విభాగం ఎస్పీగా పని చేస్తున్న ఎం.దీపికాను నియమించారు. విజయనగరం, నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించారు. మొత్తంగా రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలు.. -
శభాష్ పోలీస్
-
రోజంతా ప్రజాసేవకే..
-
ధ్యానంపై అవగాహన అవసరం
గుడివాడ టౌన్ : విద్యార్థి దశ నుంచే ధ్యానంపై పట్టు ఉండాలని రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఫౌండ్ ఆఫ్ ట్రస్టీ రాజకుమారి అన్నారు. స్థానిక రూరల్ మండలం తట్టివర్రు రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ జీవీఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ధ్యానం జ్ఞానాన్ని పెంచుతుందని, అది విద్యార్థి దశ నుంచే అలవరుచుకుంటే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. విద్యార్థులు ధ్యానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు మనోహర్, జ్ఞానకేంద్ర ఉపాధ్యాయులు అనిత, అనిల్, మాధవి, వంశీ పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చేది ఎల్ఐసీ
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం): ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చేది భారతీయ జీవిత బీమాసంస్థ(ఎల్ఐసీ) అని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. సంస్థ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయంలో డైమండ్ జూబ్లీ సంబరాలను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. ప్రభుత్వపాఠశాలల్లో బాలికల టాయిలెట్స్ అభివృద్ధికి సహకరించాలని ఆమె సూచించారు. సీనియర్ డివిజనల్ మేనేజర్ జె. రంగారావు మాట్లాడుతూ జోనల్ స్థాయిలో ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజన్ ముందంజలో ఉందన్నారు. సీఎస్ఆర్ నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రూ.13 లక్షలతో నిడదవోలులోని హృదాలయం మానసిక వికలాంగుల సంస్థకు వ్యాన్‌ను బహూకరించామన్నారు. రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయం పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన, 20బ్రాంచ్‌ల పరిధిలో ఒక్కో స్కూలు నుంచి ఐదుగురు విద్యార్థులకు అవార్డులు, డివిజనల్ పరి«ధిలో పదిమంది విద్యార్థులు, పదిమంది విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేస్తున్నామన్నారు. దత్తత గ్రామం కాట్రావులపల్లిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చే స్తామన్నారు. ఎల్ఐసీ ఏఎస్ డిపార్టుమెంట్ హెచ్జీఏ గాయత్రీదేవి రచించిన, కొవ్వూరు హెచ్జీఏ స్వరపరిచిన, ఎఫ్అండ్ఏ మేనేజర్ సహకారంతో రూపుదిద్దుకున్న పాటల సీడీని ఎస్పీ రాజకుమారి ఆవిష్కరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, మేనేజర్ (హెచ్ఆర్) నాగేంద్రకుమార్, మేనేజర్ (సేల్స్) బీఎస్ చక్రవర్తి, ఎల్ఐసీ ఉద్యోగ సంఘ నాయకులు ఎంఏఎఫ్ బెనర్జీ, పి.సతీష్, టి. బాబూ రాజేంద్రప్రసాద్, ఎస్.గన్నియ్య, ఉమాదేవి, ఎల్ఐసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీపై కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గం
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి కొరిటెపాడు(గుంటూరు): తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని శాసనమండలి మాజీ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. స్థానిక నవభారత్ నగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలపై పన్నులు విధించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు పన్నులు కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 10 సంవత్సరాలు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా తేల్చారని, ఈ 10 ఏళ్లు కూడా ఆగలేరా అని ప్రశ్నించారు. ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటే రేపు సచివాలయం, అసెంబ్లీకి కూడా పన్నులు కట్టాలని తెలంగాణ ప్రభుత్వం అదేశిస్తుందన్నారు. ఈ ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాసనమండలి చీఫ్ విఫ్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగిసిందని ఆమె తెలిపారు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని స్పష్టం చేశారు. నన్నపనేని రాజకుమారి చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, ములకా సత్యవాణిరెడ్డి, చిట్టాబత్తిన చిట్టిబాబు, చంద్రగిరి ఏడుకొండలు, పోతురాజు ఉమాదేవి, నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సరళిపై ‘ప్రత్యేక’ దృష్టి
తాండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల దృష్ట్యా నగదు, మద్యం, ఇతర సామగ్రిల తరలింపును అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శిం చారు. మున్సిపల్ ఎన్నికల అధికారి గోప య్య, డీఎస్పీ షేక ఇస్మాయిల్‌తో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రంతోపాటు ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామగ్రి, సిబ్బంది తరలింపు అంశాలపై ఎన్నికల అధికారితో సమీక్షించారు. 57 పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్‌లను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని ఎస్పీకి గోపయ్య వివరించారు. అనంతరం ఎస్పీ పాతతాండూరులోని సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఒక ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లతో 12 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ టీంలు గ్రామాల్లో, ప్రధాన మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. నగదు, మద్యం, కానుకులు తదితరాలు అక్రమంగా తరలిస్తే స్వాధీనం చేసుకొని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వివరించారు. 12 ప్లయింగ్ స్క్వాడ్లను తనిఖీలకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూ.50వేలకు మించి నా, మించకపోయినా నగదు పట్టుబడితే దానికి ఎలాంటి రసీదులు చూపించని పక్షంలో స్వాధీనం చేసుకుంటామన్నారు. తనిఖీలను వీడియో చిత్రీకరణ చేయడం జరుగుతుందన్నారు. వచ్చే నాలుగు రో జుల్లో పోలీసు అధికారులంతా తమ పరి ధిలోని సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి జాగ్రత్త చర్యలు చేపడతారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, మైక్‌లు ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో సొంత డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నా రు. ఎన్నికల కమిషన్ అనుమతితో తాం డూరు అర్భన్‌కు త్వరలోనే సీఐ నియామకం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ముడిమ్యాల, గౌతాపూర్‌లలో నిర్వహిం చిన తనిఖీల్లో రూ.5.5లక్షల నగదును సీజ్ చేశామన్నారు. ఎస్పీ వెంట సీఐ రవి, ఎస్ఐలు ప్రణయ్, నాగార్జున్ ఉన్నారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి... పెద్దేముల్: ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దేముల్ మండల సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆమె తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని అదేశించారు. ఇప్పటి వరకు 250 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. 743 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. ఎన్నికల కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా కేసులు తప్పవన్నారు. అనంతరం ఎస్పీ తాండూరు-హైదరాబాద్ రహదారిపై మంబాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. -
నేడు ప్రేమికుల దినోత్సవం
‘ప్రేమ’ రెండక్షరాల మధుర భావన.. మాటలకందని తియ్యని అనుభూతి.. మనసును ఓలలాడించే ఓ అద్భుత కావ్యం.. రెండు మనసుల కలయిక.. రెండు హృదయాల గుండె చప్పుడు.. ప్రేమ ఒక సాగరం.. ఇలా వర్ణించుకుంటూ పోతే రోజులు చాలవు. అందుకే ఈ రెండక్షరాల మాట నుంచే ఎందరో సినీ కవులు మధురమైన గేయాలను రచించగలిగారు. మరెందరో దర్శకులు విభిన్నమైన చిత్రాలు తీయగలిగారు. ప్రేమ గురించి.. ప్రేమికుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. నేడు ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా అలా {పేమ లోకంలో విహరించి వివాహ బంధంతో ఒక్కటైన కొన్ని జంటల ఉద్యమం కలిపింది... ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన జగదీశ్.. విశాఖపట్నం ఆనందపురం మండలానికి చెందిన రాజకుమారిలను ఉద్యమం కలిపింది. జగదీశ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు. రాజకుమారి విశాఖపట్నం ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్. రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. రాజకుమారి విద్యార్థుల సమస్యలపై స్పందించే తీరు.. పోరాట పటిమ జగదీశ్‌ను కట్టిపడేశాయి. సంఘాన్ని నడిపించడంలో శక్తిసామర్థ్యాలు.. తోటివారికి అండగా నిలవాలనే సేవాగుణం రాజకుమారికి నచ్చాయి. ఇద్దరినీ ప్రేమ తీరాలవైపు నడిపించాయి. రెండేళ్లు ప్రేమించుకుని అనంతరం ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాజకుమారి ఓ న్యూస్‌చానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తుండగా.. జగదీశ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. ‘అంతరాలు లేని సమాజం కోసం పనిచేస్తూ.. ప్రేమ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నదే తమ లక్ష్యం’ అంటోంది ఆ జంట. తమలాంటి ప్రేమికులకు ‘వాలెంటైన్స డే’ ఒక పండుగలాంటిది అంటున్నారు. అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ... తాండూరు పట్టణానికి చెందిన ఎం.విజయ్‌కుమార్ ఓ ఉద్యమ పార్టీలో పని చేస్తున్నప్పుడు హైదరాబాద్‌కు చెందిన అనితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో 2012లో ఇద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోని కష్ట,సుఖాల్లో కలకాలం కలిసుండేదే నిజమైన ప్రేమ అని చెబుతున్నారు. అన్యోన్యంగా ఉన్నాం.. ఇంటర్ నుంచి ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 17 ఏళ్లు అవుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒకరు ఉద్యోగం చేస్తే ఇంకొకరు న్నత చదువులకు ప్రిపేర్ కావాలన్నది ఇద్దరి అంగీకారం. అందులో భాగంగానే ఈఓపీఅర్డీగా ఏంపికై ఉద్యోగం చేస్తున్నాను. ప్రేమించుకోవడం ముఖ్యం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉండడం ప్రధానం. -అమృత, ఈఓపీఅర్డీ, మోమిన్‌పేట మనసులు కలిశాయి.. మనువు ఒక్కటి చేసింది నల్లగొండ జిల్లా చింతల పల్లి మండలం, నర్సాల పల్లి గ్రామానికి చెందిన జింకల యాదగిరి పేదరికం కారణంగా వసతి గృహంలో ఉండి చదువుకునేవాడు. ఈ క్రమంలో తీవ్రం జ్వరంతో కాలుకు పోలియో సోకింది. చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో తనకు తెలిసిన వారి సాయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టెలిఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనికి కుదిరాడు. యజమానికి నచ్చేలా నడుచుకున్నాడు. అదే సమయంలో యజమాని నిర్వహించే మరోషాపులో పనిచేస్తున్న అనాథ అమ్మాయి శ్రీలక్ష్మితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ముందుగా విషయాన్ని తమ యజమానికి తెలిపారు. ఆయన అంగీకరించడంతో యాదగిరి కుటుంబ సభ్యులను అడిగారు. ముందు నిరాకరించినా తర్వాత అంగీకరించారు. ఇద్దరూ పెళ్లి చేసుకొని ఘట్కేసర్ బస్టాపులో టెలిఫోన్ బూత్, టీస్టాల్, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ అభివృద్ధి సాధించారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ తమ మధ్య ఏనాడు మనస్పర్థలు రాలేదని చెబుతున్నారు. -
పాస్టర్ హత్య కేసులో వీడిన మిస్టరీ
వికారాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓ ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి శనివారం రిమాండుకు తరలించారు. గతంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పాస్టర్‌ను చంపింది కూడా ఈ ముఠానేనని ఎస్పీ చెప్పారు. శుక్రవారం ఎస్పీ రాజకుమారి తన కార్యాలయంలో కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన గండికోట శ్రీను అలియాస్ రామకృష్ణ, గండికోట రాజు, అదే మండలం నెమ్మాని గ్రామానికి చెందిన కడియాల ఉదయ్‌కుమార్, గుంటోజు శివలు హిందూ మతంపై అభిమానంతో మత మార్పిడీలను తీవ్రంగా వ్యతిరేకించసాగారు. గండికోట రామకృష్ణ కొంతకాలంగా హిందూ వాహిని జిల్లా ప్రచార క్‌గా పనిచేస్తూ ఏడాదిగా వికారాబాద్‌లో ఉంటున్నాడు. గతనెల 29న నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పాస్టర్‌గా పనిచేస్తున్న నామా మోజెస్‌పై గండికోట రామకృష్ణ, గండికోట రాజు, కడియల ఉదయ్‌కుమార్, గుంటోజు శివలు దాడి చే శారు. దీనికి వారు అక్కడ తమ స్నేహితులైన నాగరాజు, అనుదీప్, రవి, ఏదునూరి వంశీధర్రెడ్డిల సహకారం తీసుకున్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో మత మార్పిడీలు జరుగుతున్నాయని, దీనికి వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు సహకరిస్తున్నారని భావించారు. నిందితులు వికారాబాద్ నివాసులైన సంతోష్, రాహుల్రెడ్డిల సహకారం తీసుకున్నారు. ఈనెల 9న రామయ్యగూడలోని బేతల్ చర్చి పాస్టర్ ఫ్రాంక్లిన్పై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించారు. మరుసటి రోజు రాత్రి అయ్యప్ప కాలనీలోని సియోన్ చర్చిలో పాస్టర్ సంజీవులుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పాస్టర్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13వ తేదీన మృతిచెందిన విషయం తెలిసిందే. పాస్టర్‌పై దాడి చేసిన తర్వాత నిందితులు సంతోష్, రాహుల్‌రెడ్డి బైక్‌లపై ఓ బేకరీకి.. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి భోజనం పార్సిల్ తీసుకున్నారు. వికారాబాద్‌లోని రామకృష్ణ గదిలో గడిపిన నిందితులు మరుసటి రోజు ఉదయం కుల్కచర్ల మండలం హిందూ వాహిని బాధ్యుడైన రాఘవేందర్ స్వగ్రామం ఘనాపూర్‌కు వెళ్లి ఈనెల 16 వరకు తలదాచుకున్నారు. అప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్థానిక డీఎస్పీ నర్సింలు నేతృత్వంలో వికారాబాద్, పరిగి, మోమిన్‌పేట్ సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్లాలతోపాటు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. నార్కట్‌పల్లిలో పాస్టర్‌పై జరిగిన దాడి.. సియోన్ చర్చి పాస్టర్ సంజీవులుపై దాడి ఒకే తీరుగా ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మురం చేశారు. నిందితుల సెల్‌ఫోన్ కాల్ డేటాతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టుకున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్ ఇసాఖాన్బాగ్లోని వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సంతోష్ ఇంట్లో నిందితుల్లో ఒకరైన శివ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా హత్య మిస్టరీ వీడిందని ఎస్పీ చెప్పారు. పాస్టర్ సంజీవులు మత మార్పిడులకు పాల్పడడం వల్లే దాడి చేశామని నిందితులు చెప్పారన్నారు. సంజీవులుపై దాడిలో తనతోపాటు ఉదయ్‌కుమార్, రాజు, రామకృష్ణ ఉన్నారని నిందితుడు శివ చెప్పాడు. ప్రధాన నిందితుల్లో శివను పోలీసులు అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితులకు సహకరించిన వికారాబాద్‌కు చెందిన సంతోష్, రాహుల్‌రెడ్డి, రాఘవేందర్‌లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మిగతా ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేశాక.. పాస్టర్ హత్యలో మరిన్ని విషయాలు వెలుగుచేసే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. కాగా పాస్టర్‌పై దాడి చేసిన నలుగురు ఓ దారి దోపిడీ కేసులో అనుమానితులన్నారు. ప్రార్థనా స్థలాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. కేసు మిస్టరీ ఛేదనలో కృషి చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డితో పాటు సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయలాలను ఎస్పీ రాజకుమారి ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి, సీఐలు లచ్చీరాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్లాల ఉన్నారు. -
నిబంధనల అతిక్రమణ వల్లే ప్రమాదాలు
పరిగి, న్యూస్‌లైన్: వాహనదారులు నిబంధనలను అతిక్రమించడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ రాజకుమారి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం పరిగి బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీతోపాటు వివిధ వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజ రైన ఎస్పీ.. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డిలు ‘ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ సేఫ్టీ’పై ఆర్టీఏ అధికారులు రూపొందించిన ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ టూ వీలర్‌పై ముగ్గురు ప్రయాణం చేయకూడదని, చిన్న తప్పిదం వల్ల ప్రమాదం చోటుచేసుకుని ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ద్వి, త్రి చక్ర వాహనాల వల్లే ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయన్నారు. జిల్లాలో గడిచిన ఏడాదిలో 363 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, అందులో 203 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. అం దులో 84 మంది ఆటో ప్రమాదాల్లో, 84 మంది టూ వీలర్ ప్రమాదాల్లో మృతి చెందారన్నారు. జిల్లాలో ఆర్టీసీకి సంబంధించి సైతం 20 కేసులు నమోదయ్యాయన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని అన్నారు. నిమిషానికో ప్రమాదం.. 90 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ) రమేష్ అన్నారు. దేశంలో నిమిషానికో ప్రమాదం, నాలుగు నిమిషాలకో మృతి ఉంటున్నాయన్నారు. ప్రమాదాల నియంత్రణ కోసం బీజాపూర్ రహదారిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి పరుస్తామన్నారు. రెండేళ్లలో ఇది పూర్తవుతుందని చెప్పా రు. రెండు నెలల్లో జిల్లాలో 265 ప్రైవే టు బస్సులు సీజ్ చేశామని చెప్పారు. దేశంలో రాష్ట్రం రెండో స్థానం.. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ అన్నారు. అతి వేగం ప్రమాదానికి దారి తీస్తోందని, చనిపోతున్న వా రిలో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారని పేర్కొన్నారు. సెల్ మాట్లాడు తూ, మద్యం తీసుకున్నాక డ్రైవింగ్ చేయకూడదని చెప్పారు. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎంవీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మోటార్ వెహికిల్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు నగేష్, లారీ యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
గుట్టుగా డబ్బు, గంధపు చెక్కల రవాణా
చేవెళ్ల, న్యూస్‌లైన్: గుట్టుగా తరలిస్తున్న దాదాపు రూ. 10 లక్షల నగదు, గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో ఈ బాగోతం వెలుగుచూసింది. నిందితులను ఇద్దరిని రిమాండుకు తరలించగా మరో ఇరువురు పరారీలో ఉన్నారు. చేవెళ్లలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఠాణా సమీపంలో శనివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. వారు ఓ టాటా మొబైల్‌ను ఆపగానే సదరు వాహనంలోని ఓ వ్యక్తి పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని ఠాణాకు తరలించి డ్రైవర్ నారీఉమేష్ను తమదైన శైలిలో విచారించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని భూమ్ తాలుకా వంగి గ్రామానికి చెందిన గంధపు చెక్కల వ్యాపారి సుభాష్ అన్నాపవార్ అదే రాష్ట్రంలోని ఉస్మానాబాద్ నుంచి శ్రీగంధం రకం చెక్కలను షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ వద్ద గల ఆంధ్రా ఫర్ఫ్యూమ్స్ కంపెనీకి ఇటీవల రెండుసార్లు సరఫరా చేశాడు. ఈ డబ్బులు తీసుకెళ్లేందుకు శనివారం టాటా మొబైల్ వాహనంలో వచ్చాడు. ఉపయోగం రాని 25 కిలోల గంధపు చెక్కలను, గతంలోని దుంగలకు సంబంధించిన రూ. 9 లక్షల 85 వేలను తీసుకొని స్వస్థలానికి వెళ్తున్నాడు. అనుమానం రాకుండా కూరగాయలను తీసుకువెళ్లే ప్లాస్టిక్ డబ్బాల్లో గంధం దుంగలను వేసుకొని వెళ్తూ పోలీసులకు పట్టుబ డ్డారు. పోలీసులు వాహనం ఆపగానేగంధపు చెక్కల వ్యాపారి సుభాష్ అన్నాపవార్ పరారయ్యాడు. ఆయనతో పాటు ఫర్ప్యూమ్ కంపెనీ యజమాని అబ్దుల్లా, ఫ్యాక్టరీ సూపర్వైజర్ ఆసిఫ్, డ్రైవర్ నారీ ఉమేష్‌లపై పోలీసులు ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 20, 29, 32, ఏపీ శాండిల్ యాక్ట్ 3, ఐపీసీ 411 చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సుభాష్ అన్నాపవార్, ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్లాలు పరారీలో ఉన్నారని, మిగతా ఇద్దరిని శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. దుంగలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో చేవెళ్ల డీఎస్పీ సీహెచ్.శ్రీధర్, శిక్షణ డీఎస్పీ సౌజన్య, సీఐలు గంగారాం, వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు లక్ష్మీరెడ్డి, శేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దుంగలను చాకచక్యగా పట్టుకును హెడ్‌కానిస్టేబుల్ భీంరావు, కానిస్టేబుళ్లు నాగరాజు, లింగమయ్య, కిషన్, ఫారూక్‌లను ఎస్పీ రాజకుమారి అభినందించారు. -
జైదుపల్లిగుట్టల్లో ఫైరింగ్ రేంజ్
ధారూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసు ఫైరింగ్‌రేంజ్‌లు ఉన్నాయని, ఒక్క రంగారెడ్డిలోనే లేదని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అదనపు ఎస్పీ వెంకటస్వామి, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి మండలంలోని జైదుపల్లి సమీపంలో ఉన్న 116, 122 సర్వేనంబర్లలోని గుట్టల ప్రాంత భూములను పరిశీలించారు. రెండు సర్వేనంబర్లలో రోడ్డు ముఖంగా 75 ఎకరాల భూమి కోసం గతంలోనే తహసీల్దార్‌కు దరఖాస్తు చేశామని, ఇందులో భాగంగానే భూములను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఫైరింగ్రేంజ్తో పాటు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికారాబాద్‌లో డీటీసీ కేంద్రం ఉన్నా పోలీసు ఫైరింగ్రేంజ్ లేక శిక్షణలో ఉన్న వారిని 100 కిలోమీటర్ల దూరంలోని అప్పాకు (పోలీసు అకాడమీ), లేదంటే మహబూబ్‌నగర్ జిల్లాకు పంపాల్సి వస్తోందన్నారు. 100 కిలోమీటర్లు వెళ్లి రావాలంటే వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని పేర్కొన్నారు. స్థానికంగా స్థలం కోసం ప్రయత్నాలు చేశామని, జైదుపల్లి గ్రామ సమీపంలోని గుట్టప్రాంతం అనువుగా ఉందన్నారు. దీనికి సంబంధించిన భూముల మ్యాప్‌ను ఎస్పీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు సర్వేనంబర్లలో ఎక్కడెక్కడ భూములున్నాయో సర్వేయర్ ఎస్పీకి చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే జిల్లా ఎస్సీ పరిధి కూడా పెరిగే అవకాశం ఉందని, వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉందని ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. పోలీసుల అవసరాల కోసం ముందుగానే స్థలాల అన్వేషణ చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట సర్వేయర్ రూప, ధారూరు ఎస్ఐ మొయినొద్దీన్ తదితరులు ఉన్నారు. -
విద్యకు ప్రాధాన్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపకారవేతనాల కార్యక్రమంతో పెద్దఎత్తున లబ్ధి చేకూరనున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యా నిధితో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలిగిందని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఎస్సీ విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేందుకు జిల్లాకు ఆరు ఇందిరమ్మ విద్యా నిలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఏడాది నుంచి ఐదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకుగాను జిల్లాకు కొత్తగా 2 ఐటీఐ కాలేజీలు, మల్కాజ్‌గిరికి డిగ్రీ కాలేజీ ఇటీవల మంజూరయ్యాయన్నారు. పాలన మరింత సులభతరం.. ప్రభుత్వ పాలనను మరింత సులభతరం చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిందన్నారు. మీ సేవా కేంద్రాలతో రెవెన్యూ సేవలు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో ఏడో విడత భూ పంపిణీ ద్వారా 1,106 ఎకరాలు భూమిని 666 మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ైరె తులకు రుణాలు, రాయితీపై పనిముట్లు.. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రైతాంగానికి వడ్డీలేని రుణాలిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రూ.355కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రూ. 5.61కోట్ల వ్యయంతో 50శాతం రాయితీపై పనిముట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు గాను కొత్తగా 400కేవీ సామర్థ్యం గల మూడు సబ్స్టేషన్లు, 132 కేవీ సామర్థ్యం గల రెండు, 220కేవీ సామర్థ్యం గల ఒకటి, 33 కేవీ సామర్థ్యం గల 9 సబ్స్టేషన్లు రూ.271 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కూరగాయలు, పూలు, పండ్లతోటల సాగును మరింత విస్తరించేందుకు జిల్లాకు అధికంగా పాలీహౌస్ యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. మహిళా సంఘాలకు రూ.12కోట్ల రుణాలు, అభయ హస్తం కింద రూ.1.77కోట్ల పింఛన్లు, వికలాంగులకు 6 ట్రైసైకిళ్లు, ఆర్వీఎం ద్వారా 40 మంది విద్యార్థులకు 6.15లక్షల విలువైన వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ చంపాలాల్, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, డీఈఓ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.