పరిగి, న్యూస్‌లైన్: వాహనదారులు నిబంధనలను అతిక్రమించడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ రాజకుమారి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం పరిగి బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీతోపాటు వివిధ వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజ రైన ఎస్పీ.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ వెంకట్‌రెడ్డిలు ‘ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ సేఫ్టీ’పై ఆర్టీఏ అధికారులు రూపొందించిన ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ టూ వీలర్‌పై ముగ్గురు ప్రయాణం చేయకూడదని, చిన్న తప్పిదం వల్ల ప్రమాదం చోటుచేసుకుని ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు.
ద్వి, త్రి చక్ర వాహనాల వల్లే ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయన్నారు. జిల్లాలో గడిచిన ఏడాదిలో 363 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, అందులో 203 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. అం దులో 84 మంది ఆటో ప్రమాదాల్లో, 84 మంది టూ వీలర్ ప్రమాదాల్లో మృతి చెందారన్నారు. జిల్లాలో ఆర్టీసీకి సంబంధించి సైతం 20 కేసులు నమోదయ్యాయన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని అన్నారు.
నిమిషానికో ప్రమాదం..
90 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(డీటీసీ) రమేష్ అన్నారు. దేశంలో నిమిషానికో ప్రమాదం, నాలుగు నిమిషాలకో మృతి ఉంటున్నాయన్నారు. ప్రమాదాల నియంత్రణ కోసం బీజాపూర్ రహదారిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి పరుస్తామన్నారు. రెండేళ్లలో ఇది పూర్తవుతుందని చెప్పా రు. రెండు నెలల్లో జిల్లాలో 265 ప్రైవే టు బస్సులు సీజ్ చేశామని చెప్పారు.
దేశంలో రాష్ట్రం రెండో స్థానం..
రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ అన్నారు. అతి వేగం ప్రమాదానికి దారి తీస్తోందని, చనిపోతున్న వా రిలో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారని పేర్కొన్నారు. సెల్ మాట్లాడు తూ, మద్యం తీసుకున్నాక డ్రైవింగ్ చేయకూడదని చెప్పారు. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎంవీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మోటార్ వెహికిల్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు నగేష్, లారీ యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిబంధనల అతిక్రమణ వల్లే ప్రమాదాలు
Published Thu, Jan 23 2014 3:32 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement