ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చేది ఎల్‌ఐసీ
ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చేది ఎల్‌ఐసీ
Published Thu, Sep 1 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం): ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చేది భారతీయ జీవిత బీమాసంస్థ(ఎల్‌ఐసీ) అని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. సంస్థ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయంలో డైమండ్ జూబ్లీ సంబరాలను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. ప్రభుత్వపాఠశాలల్లో బాలికల టాయిలెట్స్ అభివృద్ధికి సహకరించాలని ఆమె సూచించారు. సీనియర్ డివిజనల్ మేనేజర్ జె. రంగారావు మాట్లాడుతూ జోనల్ స్థాయిలో ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజన్ ముందంజలో ఉందన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రూ.13 లక్షలతో నిడదవోలులోని హృదాలయం మానసిక వికలాంగుల సంస్థకు వ్యాన్‌ను బహూకరించామన్నారు. రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయం పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన, 20బ్రాంచ్‌ల పరిధిలో ఒక్కో స్కూలు నుంచి ఐదుగురు విద్యార్థులకు అవార్డులు, డివిజనల్ పరి«ధిలో పదిమంది విద్యార్థులు, పదిమంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేస్తున్నామన్నారు. దత్తత గ్రామం కాట్రావులపల్లిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చే స్తామన్నారు. ఎల్‌ఐసీ ఏఎస్ డిపార్టుమెంట్ హెచ్‌జీఏ గాయత్రీదేవి రచించిన, కొవ్వూరు హెచ్‌జీఏ స్వరపరిచిన, ఎఫ్‌అండ్‌ఏ మేనేజర్ సహకారంతో రూపుదిద్దుకున్న పాటల సీడీని ఎస్పీ రాజకుమారి ఆవిష్కరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, మేనేజర్ (హెచ్‌ఆర్) నాగేంద్రకుమార్, మేనేజర్ (సేల్స్) బీఎస్ చక్రవర్తి, ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘ నాయకులు ఎంఏఎఫ్ బెనర్జీ, పి.సతీష్, టి. బాబూ రాజేంద్రప్రసాద్, ఎస్.గన్నియ్య, ఉమాదేవి, ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement