ఎన్నికల సరళిపై ‘ప్రత్యేక’ దృష్టి | special focus on elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల సరళిపై ‘ప్రత్యేక’ దృష్టి

Published Tue, Mar 11 2014 11:38 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

special focus on elections

తాండూరు, న్యూస్‌లైన్:  ఎన్నికల దృష్ట్యా నగదు, మద్యం, ఇతర సామగ్రిల తరలింపును అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శిం చారు. మున్సిపల్ ఎన్నికల అధికారి గోప య్య,  డీఎస్పీ షేక ఇస్మాయిల్‌తో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రంతోపాటు ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామగ్రి, సిబ్బంది తరలింపు అంశాలపై ఎన్నికల అధికారితో సమీక్షించారు. 57 పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్‌లను పరిశీలించారు.

 నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని ఎస్పీకి గోపయ్య వివరించారు. అనంతరం ఎస్పీ పాతతాండూరులోని సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లతో 12 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ టీంలు గ్రామాల్లో, ప్రధాన మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. నగదు, మద్యం, కానుకులు తదితరాలు అక్రమంగా తరలిస్తే స్వాధీనం చేసుకొని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని వివరించారు. 12 ప్లయింగ్ స్క్వాడ్‌లను తనిఖీలకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూ.50వేలకు మించి నా, మించకపోయినా నగదు పట్టుబడితే దానికి ఎలాంటి రసీదులు చూపించని పక్షంలో స్వాధీనం చేసుకుంటామన్నారు.

తనిఖీలను వీడియో చిత్రీకరణ చేయడం జరుగుతుందన్నారు. వచ్చే నాలుగు రో జుల్లో పోలీసు అధికారులంతా తమ పరి ధిలోని సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి జాగ్రత్త చర్యలు చేపడతారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, మైక్‌లు ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో సొంత డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నా రు. ఎన్నికల కమిషన్ అనుమతితో తాం డూరు అర్భన్‌కు త్వరలోనే సీఐ నియామకం చేస్తామన్నారు.

 ఇప్పటి వరకు ముడిమ్యాల, గౌతాపూర్‌లలో నిర్వహిం చిన తనిఖీల్లో రూ.5.5లక్షల నగదును సీజ్ చేశామన్నారు. ఎస్పీ వెంట సీఐ రవి, ఎస్‌ఐలు ప్రణయ్, నాగార్జున్ ఉన్నారు.

 ఓటు హక్కును స్వేచ్ఛగా  వినియోగించుకోవాలి...
 పెద్దేముల్: ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దేముల్ మండల సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆమె తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని అదేశించారు. ఇప్పటి వరకు 250 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. 743 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. ఎన్నికల కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా కేసులు తప్పవన్నారు. అనంతరం ఎస్పీ తాండూరు-హైదరాబాద్ రహదారిపై మంబాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement