కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి | cpi jagadeesh fires on bjp | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి

Published Sat, Jul 30 2016 11:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి - Sakshi

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి

కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా దక్కలేదని, అదే గతి బీజేపీకి పడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ధ్వజమెత్తారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా దక్కలేదని, అదే గతి బీజేపీకి పడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజిని అందిస్తామని చెప్పి రెండేళ్లయినా ఎటువంటి హామీని అందించలేదన్నారు.


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, నగర కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవై ప్రసాద్, రమణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్సన్‌బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement