ఎన్‌జీ కాలేజీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు | NG college celebrating dimond jublee today | Sakshi
Sakshi News home page

ఎన్‌జీ కాలేజీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు

Published Fri, Jul 22 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

NG college celebrating dimond jublee  today

నల్లగొండ : నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సెమినార్‌ హాల్‌లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యే క ఆహ్వానితులుగా ఎంజీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్‌ హుస్సేన్, ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ, ఎస్పీ ప్రకాశ్‌ రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సిహెచ్‌ ప్రభాకర్, ఎన్‌కాలేజీ స్థాపన సభ్యులు టి.వెంకటనారాయణ, లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ ఎం.రామానుజాచార్యులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కాలేజీ ప్రి న్సిపల్‌ డా.ఆర్‌.నాగేందర్‌ రెడ్డి వ్యవహరిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement