NG college
-
వీల్‌చైర్‌లో వచ్చి.. పరీక్ష రాసి
కదల్లేని పరిస్థితిలో ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. నడవలేక పోయినా పరీక్ష రాయాలన్న తపనే తనను ముందుకు నడిపింది. దీంతో ఇలా వీల్‌చైర్‌లో వచ్చి మరీ పరీక్ష రాసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి అంగన్వాడీ టీచర్ గుజ్జ ప్రేమలతకు నెల రోజుల కిందట కాలు ఫ్యాక్చర్ కావడంతో హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయించుకుంది. రెండు నెలలు రెస్టులో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోనే ఉంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఉద్యోగం కోసం ప్రేమలత ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆమెకు సూపర్వైజర్ ఉద్యోగ పరీక్ష ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా వీల్‌చైర్‌లో వచ్చిన ఆమె.. దిండు, స్టూల్ కూడా పరీక్ష కేంద్రానికి వెంట తెచ్చుకున్నారు. నల్లగొండ ఎన్జీ కాలేజీలో పరీక్ష రాసి వెళ్లారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ నల్లగొండ -
సాఫ్‌్టబాల్ పోటీల్లో వరంగల్‌కు మూడో స్థానం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళలు సాఫ్‌్టబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. విజేతలకు టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి, టోర్నమెంట్ కన్వీనర్ దుబ్బాక నర్సింహారెడ్డి ట్రోఫీలు అందజేశారు. -
ఎన్జీ కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
నల్లగొండ : నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యే క ఆహ్వానితులుగా ఎంజీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, ఎస్పీ ప్రకాశ్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిహెచ్ ప్రభాకర్, ఎన్‌కాలేజీ స్థాపన సభ్యులు టి.వెంకటనారాయణ, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎం.రామానుజాచార్యులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కాలేజీ ప్రి న్సిపల్ డా.ఆర్.నాగేందర్ రెడ్డి వ్యవహరిస్తారు.