సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ దివాలా తీసిన దరిద్రపు పార్టీ అని, రేవంత్ రెడ్డి ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ తనపై చేసిన కామెంట్లకు కౌంటర్‌గా.. టీఆర్‌ఎస్‌ఎల్పీ నుంచి మంగళవారం ఆయన మీడియా ద్వారా మాట్లాడారు.
‘‘కాంగ్రెస్‌లోని భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి అమాయకులు. రేవంత్ మాత్రం లుచ్చా పనులు చేస్తున్నాడు. పదే పదే కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నాడు. అది రచ్చబండ కాదు.. లుచ్చా బండ. పెళ్లి పెటాకులు లేకుండా నైట్ క్లబ్‌ల చుట్టూ తిరిగే రాహుల్ గాంధీ ఓ తోపు.. ఈ పీసీసీ చీఫ్(రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి..) ఓ తోపు. అప్పుడే సీఎం అయిపోయినట్లు మాట్లాడుతున్నాడు. సీఎం కాదు కదా.. కనీసం అటెండర్ కూడా కాలేడంటూ రేవంత్‌పై మండిపడ్డారు.
టీడీపీలో ఉన్నప్పటి నుంచి తమ మధ్య గొడవలు జరుగుతుండేవని పేర్కొన్న మల్లారెడ్డి.. టీడీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రేవంత్ తనపై బెదిరింపులకు దిగాడని చెప్పారు. ‘నా కాలేజీలు మూయిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఎవరి డబ్బుతో చేశాడు.. నా డబ్బుతో చేశాను’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు మల్లారెడ్డి. కాదని యాదగిరిగుట్టపై ప్రమాణం చెప్పాలని రేవంత్‌కు సవాల్ విసిరాడు మల్లారెడ్డి.
రేవంత్ వ్యాఖ్యలపై సొంత సామాజిక వర్గమే అసంతృప్తితో ఉందని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిది అంతా డ్రామా అని, మూడేళ్లలో ఎంపీగా ఏం చేశాడని, చివరికు రాహుల్ గాంధీని సైతం బ్లాక్‌మెయిల్ చేసే రకం అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబును పట్టుకుని పీసీసీ తెచ్చుకున్నాడంటూ సెటైర్ సంధించారు.
ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని, ఆయన అల్లుడికి అందులో హస్తం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరినీ జైలుకు పంపి తీరతానంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కౌంటర్‌గానే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇలా మీడియా ముందుకు వచ్చారు. తాను ప్రభుత్వ భూమిని ఎక్కడా కొనలేదని.. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే కొన్నానని, అందులో తప్పేముందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం భూములు కొంటున్నారు కదా అని ప్రశ్నించారు. కోర్టు సైతం తనకు అనుకూల తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మల్లారెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment