గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? | Telangana assembly elections 2023 | Sakshi
Sakshi News home page

గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు?

Published Wed, Oct 11 2023 8:12 AM | Last Updated on Wed, Oct 11 2023 8:12 AM

Telangana assembly elections 2023 - Sakshi

హైదరాబాద్: కారు స్పీడ్‌ను అందుకునేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చ సాగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అభివృద్ధి మంత్రంతో ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగింది. కాగా.. కాంగ్రెస్, బీజేపీ పారీ్టల్లో ఇప్పటి వరకు టికెట్లు ఖరారు కాకపోవటంతో ఆశావహులు టెన్షన్‌ పడుతున్నారు. మరోపక్క మల్కాజిగిరిలోబీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పారీ్టపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌  పారీ్టలో చేరటంతో మారిన సమీకరణల నేపథ్యంలో జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. జిల్లాలో ప్రధాన పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం  రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో రేపో మాపో టికెట్‌ తమకే లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయిదు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల పరిస్థితి ఇలా..  

మేడ్చల్‌ 
ఠిసిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి  మేడ్చల్‌ టికెట్‌ మళ్లీ దక్కడంతో హంగూ ఆర్భాటం.. అభివృద్ధి జపంతో ప్రచార రంగంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ (జంగయ్య) యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి సహా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కాంగ్రెస్‌లో చేరిన నక్క ప్రభాకర్‌గౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అధిష్ఠానం తోటకూర జంగయ్య యాదవ్‌ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతున్నా.. హరివర్ధన్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌గౌడ్‌ తమ రాజకీయ  పలుకుబడితో టికెట్‌ కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

ఠిభారతీయ జనతా పార్టీ నుంచి  మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డి సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి మేడ్చల్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. బీజేపీ మాత్రం  బీఆర్‌ఎస్‌ దీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించటంతో పాటు అవసరమైతే.. కొత్త నేతను కూడా రంగంలోకి దింపవచ్చనే చర్చ కేడర్‌లో సాగుతోంది.  

మల్కాజిగిరి
బీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖరారు కాగా.. వీరు అనుచరగణంతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి మామ, మంత్రి మల్లారెడ్డి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై  ప్రచారం చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ లో చేరిన నందికంటి శ్రీధర్‌కు ఎంబీసీ చైర్మన్‌ పదవి రావడంతో ఆయన అనుచరులు కూడా మర్రికి మద్దతు ఇస్తున్నారు. 

కాంగ్రెస్‌ అభ్యరి్థ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరిలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మైనంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడంతో అన్ని డివిజన్లలో అభిమానులు, మైనంపల్లి సోషల్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా చేసిన సేవలు ప్రచారంలో ఉపయోగపడుతున్నాయి. ఇద్దరు కార్పొరేటర్లు వెంట ఉండగా, రాజకీయ పార్టీ నాయకులతో కూడా మైనంపల్లికి మంచి సంబంధాలు  ఉన్నాయి. 

బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం జాతీయ కోశాధికారి టి.సాయి పేర్లు వినిపిస్తున్నాయి. 

ప్రధాన పారీ్టలు బలమైన సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపుతుండగా.. బీజేపీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యరి్థని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆకుల రాజేందర్‌ ఎమ్మెల్యేగా పని చేయడం, స్థానికుడు కావడంతో పార్టీ  ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ, పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, సంప్రదాయ ఓటు బ్యాంకు ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం.   

ఉప్పల్‌
ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డిని కాదని బండారి లక్ష్మారెడ్డికి బీఆర్‌ఎస్‌కు అధిష్టానం టికెట్‌ కేటాయించటంతో కార్యకర్తల సమావేశాలతో పాటు సామాజిక వర్గాల వారీగా  నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ కార్పొరేటర్‌ భర్త మందుముల పరమేశ్వర్‌రెడ్డి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. రేపో మాపో అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారంతో తమకు పలుకుబడి ఉన్న నేతలో లాబీంగ్‌ నిర్వహిస్తున్నారు. 

 బీజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ టికెట్‌ కోసం ప్రయతి్నస్తుండగా, స్థానిక బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ అధిష్టానాలతో రాయబారాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్‌ ఎవరు ఇస్తానంటే ఆ పారీ్టలో సుభా‹Ùరెడ్డి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

గులాబీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరో? 
∙సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేవీ వివేకాందగౌడ్‌కు బీఆర్‌ఎస్‌ మళ్లీ టికెట్‌ కేటాయించడంతో.. తాను చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాల పేరుతో ఆయన ప్రజల వద్దకు వెళ్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ శంభీరాజు మాత్రం చివరి క్షణం వరకైనా బీ– ఫారం తనకే దక్కుతుందన్న ఆశతో అనుచరులతో కలిసి ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థితో శంభీపూర్‌ రాజు ఎన్నికల ప్రచారంలో కలిసి తిరగకపోవటంపై బీఆర్‌ఎస్‌లో చర్చ సాగుతోంది.   

కాంగ్రెస్‌ నుంచి కొలను హనుమంత్‌ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి పోటీలో ఉన్నారు. ఢిల్లీలో లాబీయింగ్‌ చేస్తున్న వీరు టికెట్‌ తనకేనని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు.  

బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు  టికెట్‌ ఖరారైనట్లు పార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన  ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి కూడా టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.   

కూకట్‌పల్లి 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా.. ఆ పారీ్టకి చెందిన మరో నాయకుడు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు ఏ పదవి రాకపోవడంతో ఈసారి బీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు, బొమ్మరెడ్డి ప్రేమ్‌ కుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇందులో ఎవరికి వారే టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి గొట్టుముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం టికెట్‌ ఆశిస్తుండగా, మరో నాయకుడు మన్నే సతీష్‌ తనకే టికెట్‌ రానుందని ప్రచారం చేసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement