
బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తున్న మల్లారెడ్డి, సిబ్బంది
బాలానగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని అటుగా వెళుతున్న మంత్రి మల్లారెడ్డి స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటన సోమవారం బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలానగర్ రాజు కాలనీకి చెందిన బాలస్వామి మేస్త్రీగా పని చేసేవాడు. సోమవారం సోమవారం సైకిల్‌పై నర్సాపూర్ చౌరస్తాలో ఓ వ్యక్తిని కలిసేందుకు వస్తున్న అతడిని లారీ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో బోయినపల్లి నుంచి కూకట్‌పల్లికి వెళుతున్న కార్మిక, ఉపాధి కల్పనా శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి దీనిని చూసి కాన్వాయ్‌ని నిలిపివేశారు. బాధితుడిని తానే స్వయంగా కాన్వాయ్‌లోకి ఎక్కించి సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి స్పందించిన తీరుపట్ల స్థానికులు ప్రశంసలు కురిపించారు.