జాతీయ రహదారిగా గుర్తించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారి..
నితిన్ గడ్కారీకి ఎంపీ మల్లారెడ్డి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారిగా గుర్తించిన సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారిని నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీకి మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి విన్నవించారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరిలు కూడా ఇదే అంశమై రాసిన లేఖలను గడ్కరీకి అందజేశారు.