
నరేంద్ర, గరిమా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సీఐ భారతి. రమణారెడ్డి గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్‌డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో విశాల పసునూరి నిర్మిస్తున్నారు. సోమవారం నాడు హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ... 'రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టాం. మా సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీదట కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయనున్నాం' అన్నారు.
హీరో నరేంద్ర మాట్లాడుతూ... 'రమణా రెడ్డి గారు అద్భుతమైన కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా నటించడం చాలా సంతోషం. నా పాత్ర చాలా బాగా డిజైన్ చేశారు. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment