
‘కష్టం, కన్నీళ్లు తెలిసినవాన్ని..అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వాన్ని..అందుకే ప్రజల కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీ, ఎమ్మెల్యే కంటే..రాష్ట్ర మంత్రిగా విస్తృత సేవ చేసే అవకాశాన్నికల్పించిన సీఎం కేసీఆర్‌కు, నాకువరుస విజయాలు అందించిన మేడ్చల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా’ అని రాష్ట్ర నూతన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం జరిగే యజ్ఞంలో తాను మరింత చురుకైన పాత్ర పోషిస్తూ బంగారు తెలంగాణ కోసం మిగిలిన జీవితాన్ని అంతా ఫుల్‌టైం కేటాయిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినా..రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. మరోవైపు వచ్చే లోక్‌సభ, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment