వెల్దుర్తి (కర్నూలు): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన మల్లారెడ్డి (48) అనే వ్యక్తి మంగళవారం రాత్రి డోన్ నుంచి కర్నూలుకు ఆర్టీసీ బస్సులో వెళుతున్నాడు. వెల్దుర్తి సమీపంలోకి రాగానే గుండెపోటు రావడంతో సీటులోనే కూలబడిపోయాడు. డ్రైవర్ బస్సును ఆపి పోలీసులకు సమాచారం అందించాడు.