మిరుదొడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజీ టు పీజీని స్వాగతిస్తూ ఉచిత నిర్బంధ విద్యకు ట్రెస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) సహకరిస్తుందని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జెగ్గు మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం మిరుదొడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ట్రెస్మా అత్యంత కీలకపాత్ర పోషించిందన్నారు.
అదే స్ఫూర్తితో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో టెన్త్ ఫలితాల్లో అగ్రగామిగా నిలపడానికి ట్రెస్మా సభ్యులు ఎనలేని కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ఆర్ కృష్ణమాచారి, కోశాధికారి జి.సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, జిల్లా ప్రతినిధులు సంతోష్, బాల్‌రెడ్డి, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, సికిందర్, లింగం తదితరులు పాల్గొన్నారు.