
ఢిల్లీ: తాను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. తాను పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ నాయకత్వాని ధిక్కారించేవాడిని కాదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటానని తెలిపారు.
తాను ఢిల్లీలో అసలు ప్రెస్‌మీట్ పెట్టలేదని, తనకు కీలకమైన పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ఉన్నానని, దుబ్బాక నియోజకవర్గానికి నిధులు కోసం వచ్చానని క్లారిటీ ఇచ్చారు రఘునందన్. అయితే పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదన్నారు.
చదవండి: ప్రతీ పార్టీ లెక్క చెప్పాల్సిందే.. ఎన్నికల సంఘం కొత్త ఆన్‌లైన్ పోర్టల్