
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన వేళ.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీలో తిష్ట వేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఉన్న పదవి ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని పట్టుబట్టుకు కూర్చోన్నారు. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్ నిర్వహిస్తూ తన ఆసక్తిని తెలియజేశారు రఘునందన్.
‘మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వండి. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తది. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా. మునుగోడులో రాజగోపాల్ ను గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారు. దుబ్బాకలో నా కష్టంతోనే గెలిచాను. పార్టీ సింబల్ అనేది చివరి అంశం.
నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రెండేళ్లుగా జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్లను నియమించలేకపోయారు. శాసనసభ పక్ష నాయకుడిని కూడా నియమించలేకపోయారు. పార్టీని నడిపేది ఇలాగేనా?, నేను మూడు పదవులు ఆశిస్తున్నాను. ఒకటి జాతీయ అధికార ప్రతినిధి, రెండు బీజేపీ శాసనసభ పక్ష నేత , మూడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో ఒకటి ఇస్తారని భావిస్తున్నా. లేదంటే నా దారి నాదే’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: పాత మిత్రుల కౌంటర్ల ఎపిసోడ్‌కు శుభం కార్డు.. ‘ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమంటూ..
Comments
Please login to add a commentAdd a comment