సాక్షి, హైదరాబాద్: చైనాలో అమలవుతోన్న మిలటరీ తరహా పాలనను రాష్ట్రంలో అమలు చేయాలని టీఆర్‌ఎస్ కోరుకుంటోందా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్‌రావు ప్రశ్నించారు. కొందరు మంత్రులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, చైనాలో ఉన్నది మిలటరీ పాలన అని ఐటీ మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలని ఎం.రఘునందన్ రావు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే చైనాలో ఊరుకోరని హితవు పలికారు.
ఇక్కడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేటీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రాన్ని విమర్శించడానికే అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్ సర్కారు నిర్వహిస్తోందని ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులు విడుదల చేసిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తెలుసుకోవాలన్నారు. రెండున్నర లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు రాకపోతే ఏమైందని ప్రశ్నించారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment