సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మోదీ ఫొటోలతో ముద్రించిన శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచుతున్నారంటూ బీజేపీ నేత రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్‌రావును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కాంగ్రెస్ నేతలు కోరారు.
కాగా, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు గత నెల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో మాట్లాడి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment