
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మే 28న జూబ్లీహిల్స్ పబ్‌లో హోంమంత్రి మనవడు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడని, స్వయంగా మంత్రి పీఏ బుక్ చేశారని ఆరోపించారు. శుక్రవారం రఘునందన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇందులో హోంమంత్రి మనవడు, ఎంఐ ఎం ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ప్రముఖ హిందీ పత్రిక యజమాని కొడుకు ప్రమేయం ఉంది.
సీసీటీవీ ఫుటేజీ లో ఒక్క సెకను తొలగించినట్లు తెలిసినా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. దీనిపై ట్విట్టర్ పిట్ట(మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి) ఎందుకు స్పందించలేదు? ఎమ్మెల్సీ కవిత మహిళ అయి ఉండి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు?. రూ.1200 కోట్లు పెట్టి కట్టిన పోలీస్ కమాం డ్ సెంటర్, సీసీ కెమెరాలు పని చేయడం లేదా?
ప్రపంచంలో ఎక్కడా లేన న్ని సీసీ కెమెరాలు తెలంగాణలో ఉన్నాయని అంటున్నారు. మరి వాటి ఉపయోగం ఏమి టి? ’అని ప్రశ్నించారు. బీజేఎల్పీనేత రాజాసింగ్ మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ కేసులో అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.