సాక్షి, హైదరాబాద్: ఏపీ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీకుమార్‌ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపించి వేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీల్లో తెలంగాణ అధికారు లకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకరుల తో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిని, తనకు అనుకూల మైన అధికారులను కీలక పోస్టుల్లో నియమించారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో బిహార్‌కు చెందిన అంజనీకుమార్‌ను డీజీపీగా, సంజయ్‌కుమార్ జైన్‌ను అదనపు డీజీ లా అండ్ ఆర్డర్‌గా, షాన వాజ్ ఖాసింను ఐజీ హైదరాబాద్ జోన్‌గా, స్వాతిలక్రాను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అద నపు డీజీగా నియమించారని వివరించారు. బిహార్‌కు చెందిన ఐఏఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా, అదే రాష్టానికి చెందిన ఐపీఎస్‌ను అంజనీకుమార్‌ను డీజీపీగా నియమించడాన్ని బట్టి కేసీఆర్ మూలాలు కూడా అదే రాష్ట్రంలోనే ఉన్నా యనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment