రేవంత్, కేసీఆర్‌లపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు.. పార్టీలే వేరు కానీ, నేతల ఆలోచనా విధానం మాత్రం ఒక్కటే అని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్రంలో జెండాలు మారాయి తప్ప విధానాలు మార లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల తీరుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లా డారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26 వేల కోట్లు, గ్రాంట్స్ కింద రూ.21 వేల కోట్లపైన చూపించారన్నారు. ఈ రెండు కలిపితే రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తుండగా.. మరి రాష్ట్రానికి ఏమిచ్చారని ఎలా ప్రశ్ని స్తున్నారని రఘునందన్ నిలదీశారు. ‘నిధులు వచ్చుడో.. ఇద్దరం చచ్చుడో’అన్న వారు.. కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందని తేలితే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ముక్కు నేలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదన్న సీఎం, కేంద్రానికి డీపీఆర్ ఇచ్చారా? డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌లో కొండగల్‌కు రూ.5 వేల కోట్లు ఇచ్చుకున్న వారు కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడే హక్కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment