సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ (సోమవారం)సాయంత్రం 6.5గంటలకు సెక్రటరియేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం అందించింది. విగ్రహావిష్కరణ కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఎంఐఎం నేతలను సైతం ఆహ్వానాలు పంపింది.
అయితే, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలు హాజరు కావడం లేదు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాలేకపోతునట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలు, కేసీఆర్ సైతం పాల్గొనడం లేదని సమాచారం.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సచివాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు,కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment