గవర్నర్‌గా కేసీఆర్‌.. కేంద్ర మంత్రిగా కేటీఆర్‌ | CM Revanth Reddy Key Comments On BRS Merger With BJP | Sakshi
Sakshi News home page

గవర్నర్‌గా కేసీఆర్‌.. కేంద్ర మంత్రిగా కేటీఆర్‌

Published Sat, Aug 17 2024 4:40 AM | Last Updated on Sat, Aug 17 2024 8:25 AM

CM Revanth Reddy Key Comments On BRS Merger With BJP

త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపితే కవితకు బెయిల్‌ 

ప్రచారం కోసం కాదు పెట్టుబడుల కోసమే విదేశాల్లో పర్యటించా 

నా సోదరులు, కుటుంబమే నా బలం.. ముందునుంచే వ్యాపారాలు చేస్తున్నారు 

వారికేమైనా పదవులు ఇచ్చానా? ఎందుకు బద్నాం చేస్తున్నారని ప్రశ్న 

ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్‌చాట్‌

 

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌­రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన విలీ­నం జరగాలన్న అంశంపై ఆ రెండు పారీ్టలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయని.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడమే ఒప్పందమని పేర్కొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లానని.. అక్కడ కలసిన ప్రతి కంపెనీ, ప్రతినిధి పెట్టుబడి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదని చెప్పారు.

శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌ అక్కడ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా పలు సంచలన కామెంట్లు చేశారు. తనపై వచి్చన ఆరోపణలపైనా స్పందించారు. రేవంత్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్‌ బీజేపీలో విలీనం అవుతుందనుకుంటున్నా. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లోనే కేటీఆర్‌ ఖండిస్తున్నారు. వివిధ స్థాయిల్లో బేరసారాలు సాగిస్తున్నారు. రాజ్య­సభ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.

అంతిమంగా కేసీఆర్‌ గవర్నర్, కేటీఆర్‌ కేంద్రమంత్రి, హరీశ్‌రావు లీడర్‌ ఆఫ్‌ ది అపోజిషన్‌.. ఇది ప్రాధాన్యత క్రమం. కవిత బెయిల్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులు (ఫోర్‌ ఎంపీస్‌ ఈక్వల్‌ టు కవిత బెయిల్‌). నలుగురు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చితే కవితకు బెయిల్‌ వచ్చే అవకాశం ఉంది. 

పెట్టుబడుల కోసమే వెళ్లా.. 
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లానే తప్ప ప్రచారం కోసం కాదు. ప్రభుత్వం మారింది. కాబట్టి కొత్త ప్రభుత్వం విధానాలు వివరించి పెట్టుబడులు ఆకర్షించేందుకే విదేశాలకు వెళ్లాం. విదేశాల్లో కలసిన ప్రతి ప్రతినిధి పెట్టుబడి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదు. మాది పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులతో పోటీకాదు. నేను ప్రపంచ స్థాయిలో పోటీపడాలనుకుంటున్నా. అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్‌ తదితర దేశాలు చైనా తర్వాత మరో దేశం కోసం వెతుకుతున్నాయి. వారు చైనా ప్లస్‌ వన్‌ ఇండియా అని భావిస్తున్నారు. కానీ చైనా తర్వాత తెలంగాణ అని నేనంటున్నా. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. 

నా కుటుంబానికి ఏవైనా పదవులిచ్చానా? 
సోదరులు, కుటుంబమే నా బలం. వారిపై ఆరోపణలు సరికాదు. నాది పెద్ద ఫ్యామిలీ, మొత్తం 150 మంది ఉన్నారు. అది నా బలం. ప్రభుత్వంలోగానీ, పారీ్టలోగానీ వారెవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. వాళ్లు (బీఆర్‌ఎస్, బీజేపీ) ఎలా నా సోదరులను బద్నాం చేస్తారు? 30 ఏళ్లుగా నా సోదరులు విదేశాల్లో ఉంటున్నారు. కేటీఆర్‌ 2000వ సంవత్సరంలో విదేశానికి వెళ్లారు. నా సోదరులు 1992, 93లోనే వెళ్లారు. నేను సీఎం కాక ముందు నుంచే అక్కడ వ్యాపారం చేస్తున్నారు.

నేను సీఎం అయ్యానని వాళ్లు చేతులు కట్టుకుని కూర్చోవాలా? ప్రభుత్వంలో, పారీ్టలో, ఇంకేదైనా వ్యవహారంలో.. నా సోదరులు, కుటుంబ సభ్యులు తలదూర్చారా? వారికి ఏమైనా పదవులు, బాధ్యతలు ఇచ్చానా? వారి కంపెనీలకు నేను రాయితీలు ఇచ్చానా? సోదరుడు ఆ్రస్టేలియా వెళ్లాడని ఆరోపిస్తున్నారు. డబ్బులున్నాయి. టికెట్‌ కొనుక్కుని వెళ్లాడు. ప్రభుత్వం డబ్బులు, ప్రోటోకాల్‌ ఏమైనా తీసుకున్నాడా? పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఆహా్వనిస్తున్నాం. తెలంగాణ వ్యక్తిని ఆహా్వనిస్తే తప్పేంటి? ఇక కేసీఆర్‌ సొంతంగా విమానం కొనుక్కొవచ్చు కానీ.. నేను ఖరీదైన చెప్పులు కొనుక్కోవద్దా? 

ఏపీకి రాజధానే లేదు.. వాళ్లకు అడ్రస్‌ తెలియదు 
మోదీ, చంద్రబాబుల దగ్గర హైదరాబాద్‌ లేదు. వాళ్లకు అహ్మదాబాద్, విజయవాడ ఉన్నాయి. నా దగ్గర హైదరాబాద్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడుందనేది వారికే (బాబుకు) తెలియదు. ఏపీకి రాజధానే లేదు. రాజధాని అడ్రస్‌ వారికే తెలియదు. చంద్రబాబు నాయుడు నా గురువు కాదు.. నన్ను ఆయన నాయకుడిని చేయలేదు. నేను నాయకుడిని అయ్యాకే టీడీపీలో చేరాను. జిల్లా పరిషత్‌ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించా. అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంలో చాలా బలహీనంగా ఉంది. అలాంటి సమయంలో నేను టీడీపీలో చేరా. అలా ఎలివేట్‌ అయ్యాను. 

విపక్ష నేతల జోలికి వెళ్తే కష్టమే.. 
విపక్ష నేతలను జైల్లో వేస్తే ఏం జరుతుందో చెప్పడానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలే నిదర్శనం. కేసీఆర్‌ నన్ను జైల్లో వేశారు. ఆయన నౌకరీ పోయింది. వైఎస్‌ జగన్‌ చంద్రబాబును జైల్లో వేశారు. ఆయన నౌకరీ పోయింది. ఇది సింపుల్‌ పాలసీ. దీనిని ఢిల్లీవారు (ఎన్డీయే సర్కారు) కూడా అర్థం చేసుకోవాలి. 

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం 
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన రోజే అసెంబ్లీలోనే ఆ తీర్పుకు లోబడి నియామకాలు చేపడతామని ప్రకటించాం. సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్నంగా పరిశీలించాలని ఇప్పటికే సంబంధిత మంత్రికి, కమిటీకి సూచించాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రధాని మోదీ మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకోవడం తప్ప ఏమీ చేయలేరు. వర్గీకరణను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల నిర్ణయమే. 

కులగణన చేస్తే తప్పేంటి? 
మేం కులగణన చేస్తే తప్పేంటి? ఎవరి శాతం ఎంతో తెలిస్తే వచ్చే నష్టమేంటి? ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిస్తే వారికి అంత రిజర్వేషన్లు లభిస్తాయి. ఇది విద్య, ఉద్యోగాలకు సంబంధించిన విషయం.. రాజకీయ రిజర్వేషన్ల కోసం కాదు. కాంగ్రెస్‌లో వి.హనుమంతరావును మించిన విశ్వాసపాత్రుడు ఎవరూ లేరు. అందుకే ఆయనకు గతంలో మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా అధిష్టానం అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వాళ్లకే పదవులు ఇస్తాం..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement