సాక్షి, హైదరాబాద్: చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారనీ, తాను పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అక్కడే తన పదవికి రాజీనామా చేసి పోవాలని సవాల్ విసిరారు. ‘నాకు మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారం చేయడం అవివేకం...పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం’అని పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్వగ్రామం పాన్‌గల్‌లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు రుణాలతో కట్టుకున్న ఇల్లు అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు అమ్మాయిలు చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నారని వివరించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించడం తగదని పేర్కొన్నారు.
తల్లితండ్రులను కోల్పోయిన బాలుడు గౌడనాయక్ ను చేరదీసి ఉన్నత చదువులు చదివించానని, ప్రస్తుతం అతను తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. భూముల రిజి్రస్టేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి, తర్వాత పిల్లల తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు.
రఘునందన్‌పై చట్టపరంగా ముందుకెళ్తాం
పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని ఆరోపించారనీ, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్‌లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మా త్రమేనని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండరనీ, తానే అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని మంత్రి వివరించారు. దురుద్దేశపూర్వకంగా రఘునందన్‌రావు చేస్తున్న అసత్య ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు.
చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా?
Comments
Please login to add a commentAdd a comment