సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్‌కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్‌తో..
Comments
Please login to add a commentAdd a comment