న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోపాటు ఇతర పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. సంజయ్‌తో సునీల్ బన్సల్ భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని అంటున్నారు.
అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నేతల అంశాన్ని బన్సల్ వద్ద ప్రస్తావించారని.. తనతోపాటు అధిష్టానం పెద్దలపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యల విషయాన్ని వివరించారని చెప్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే విషయంపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.
మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సంజయ్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో అపాయింట్‌మెంట్ ఉన్న కారణంగా బుధవారం ఢిల్లీలోనే ఆగి.. గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment