హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్‌ఎస్ మెదక్ ఎమ్మెల్యేలు మీడియా ద్వారా వివరణ ఇచ్చిన వేళ.. బీజేపీ నేత రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయమని అన్నారాయన.
తాజా పరిణామలపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రగిలింది. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబట్టుతోంది. అందుకే హరీష్ రావు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. హరీష్‌రావుకు తెలియకుండానే ఆ నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారా?. ఆయన అనుమతితోనే వాళ్లు కలిశారు. ఇవాళ బలవంతంగా వాళ్లతో ప్రెస్‌మీట్ పెట్టించారు. కానీ, మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ కావడం ఖాయం’’ అని అన్నారాయన.
బీఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని రఘునందన్ అన్నారు. ప్రోటోకాల్ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించారా? అని నిలదీశారాయన.
హిస్టరీ రిపీట్ అవుతది
ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 26 మంది అయిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్ జోస్యం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment