సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. తమను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేశారంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
సభ ముగిసే వరకు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కాగా తమపై సస్పెన్షన్‌ను రద్దు చేసి, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానిచ్చేలా ఆదేశించాలని ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
చదవండి: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment