
రఘునందన్‌రావు
యాదగిరిగుట్ట: రాజ్యాంగంపట్ల, కోర్టుల పట్ల గౌరవం లేకుండా జాతీయ జెండాను అవమా నిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్ట ణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15 ఆగస్టు, 26 జనవరిని గొప్పగా జరుపుకోవాల్సిన సందర్భంలో కరోనా సాకుతో దూరం పెట్టడం బాధాకరమన్నారు.
హైకోర్టు చెప్పిన తరువాత కూడా పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్‌కు మనసు రాకపోవడం దారుణమన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమా వేశాల్లో.. రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలు లేవనెత్తుతానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టలేని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆత్మహత్యలను అరిక డుతామని, వారికి డబ్బులు ఇచ్చి వస్తున్నారని విమర్శించారు. వీఆర్‌ఏల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని కోరుతూ స్థానిక వీఆర్‌ఏలు ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు.