సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతల బాట సింగారం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పర్యటన ఉద్రిక్తరంగా మారిన విషయం తెలిసిందే. పర్యటన సందర్బంగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం.. బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపేశారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేతలు ఫైరయ్యారు.
ఈ క్రమంలో బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తలసాని మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను చూడవచ్చు. కిషన్‌రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?. కిషన్‌రెడ్డి వస్తానంటే నేనే కొల్లూరు తీసుకునిపోయి చూపిస్తాను. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తోంది.
తెలంగాణకు కేంద్రం ఏం చేసింది?. మేము కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల తాపత్రయం ఎందుకు?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిందా?. ఈరోజు ఉదయం నుంచి కిషన్‌రెడ్డి డ్రామా చేస్తున్నారు. అంతకుముందు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలకు కిషన్ రెడ్డి, నేను కలిసి వెళ్లాం. కిషన్ రెడ్డి చాలా సార్లు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు బాగున్నాయని అన్నారు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment