సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత(బీజేఎల్పీ)గా ఎవరిని ఎన్నుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది. బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌తో పాటు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ పార్టీ ఎమ్మెల్యేలు గా ఉన్నారు.
పార్టీలో సీనియర్‌గా ఉన్న రఘునందన్‌రావుకు ఈ అవకాశం లభిస్తుందా? లేదా మంత్రిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవమున్న ఈటలకు దక్కుతుందా? అని పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా ఈటలకు మంచి ప్రాధాన్యం లభించడం, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించినందున రఘునందన్ వైపు రాష్ట్ర నాయకత్వం మొగ్గుచూపొచ్చుననే వాదన పార్టీలో వినిపిస్తోంది.
చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’
Comments
Please login to add a commentAdd a comment