సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 29వ తేదీన తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల పార్టీ నేతల్లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితిని చక్కదిద్దేపనిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బిజీగా ఉన్నారు. ఇక, అమిత్ షా పర్యటన సందర్భంగా డాక్టర్స్, లాయర్స్, ఇంజినీర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా ఎవరిని పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది.
మరోవైపు.. స్ట్రాటజీ టీమ్ ఇన్‌చార్జ్‌గా శ్వేతా శాలిని, సోషల్ మీడియా బాధ్యతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్, కో ఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా, దీనిపై రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే బీజేపీ హైకమాండ్‌పై రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు!
Comments
Please login to add a commentAdd a comment