కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై చేపట్టిన ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.