
న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(ఏబీ పీఎంజేఏవై)లో చికిత్స పొందే వ్యక్తి మొదటిసారి చికిత్సకు వచ్చినప్పుడు ఆధార్ తప్పనిసరి కాదని, రెండోసారి చికిత్సకు వస్తే మాత్రం ఆధార్ కార్డు తప్పనిసరి అని నేషనల్ హెల్త్ ఏజెన్సీ సీఈవో ఇందు భూషణ్ ప్రకటించారు. మొదటిసారి చికిత్సకు మాత్రం ఆధార్ నెంబర్‌లేని పక్షంలో ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ఆధారాలు చూపించాలని వారు తెలిపారు. మొదటిసారి చికిత్సకోసం ఆధార్ లేకపోతే ఎన్నికల గుర్తింపుకార్డు లాంటి ఆధారాలతో ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment