సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడి అధిక మోతాదులో ఆక్సిజన్ అవసరమయ్యే రోగుల కోసం బెంగళూరుకు చెందిన డియాగో సంస్థ వంద యూనిట్ల హై ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్‌ఎఫ్ ఎన్‌సీ) యంత్రాలను అందజేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో ప్రథమేష్ మిశ్రా గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు యంత్రాలను అప్పగించారు. కోవిడ్ రోగులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఈ యూనిట్లను గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, ఛాతీ ఆసుపత్రి, టిమ్స్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని సోమేశ్ కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment